RGV: ఈ జన్మకు మారడు అంటూ ఆర్జీవీ తల్లి ఎమోషనల్..!!

-

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. దాదాపు పది సంవత్సరాల క్రితం వర్మ అంటేనే ఆయన తీసిన సినిమాలు.. టేకింగ్ స్టైల్.. వంటి విషయాల గురించి జనాలు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు వర్మ సినిమాలు అంటే ఒకరోత.. చీడపురుగు.. సమాజానికి పట్టిన బూజు.. ఇలా అంటే వ్యక్తి ఉంటే సమాజం బ్రష్టు పడుతుంది.. అనే స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ప్రస్తుతం వర్మ అంటేనే చేతిలో వోడ్కా , పక్కలో అమ్మాయి అన్నట్టుగా ఈ రెండు పదాలే వాడుతున్నారు..

ఇలా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవడం కోసం వర్మ చేసే కామెంట్లు , పనులు చూస్తే ఎవరికైనా అసహ్యం అనిపిస్తుంది. మన సమాజంలో కొందరు వర్మ చేసే పనుల వల్ల అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తూ ఫాలో అవుతున్నారు. ఏ విషయమైనా సరే వర్మ గురించి ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే తాజాగా అతడి పై వస్తున్న విమర్శల గురించి ఆయన తల్లి సూర్యావతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎమోషనల్ అయింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్యవతి మాట్లాడుతూ.. జిఎస్టి సినిమాను రాము పక్కన కూర్చొని చూశాను..

తను ఇతరుల ఇష్టాలను గౌరవిస్తాడు. తన వరకు వస్తే తనను తాను మార్చుకోవడానికి ఇష్టపడడు. తను ఇంటికి రాగానే నేను కనిపించాలి.. లేకపోతే నచ్చదు.. నన్ను చూడగానే తన కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. తనకు మారాలని మనసులో ఉంటేనే మారుతాడు. లేకపోతే ఎవ్వరు చెప్పినా మారడు. రాము ఈ జన్మలో మారడు” అంటూ ఆమె తెలిపింది. అంతేకాదు ఎన్నో విషయాలను ఆమె పంచుకుంది ..” రాము ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి తన విషయంలో నా ఆలోచన ఒకలా ఉంటుంది.. తను ఎవరో నాకు తెలియకపోతే అప్పుడు నా ఆలోచనలు కూడా ఇంకోలా ఉంటాయి కదా” అంటూ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు సూర్యావతి.

Read more RELATED
Recommended to you

Latest news