ప్రభాస్‌, బన్నీ రీల్‌ స్టార్లు…రియల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ కేసీఆరే – RGV

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు.

కాగా, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై సంచలన ట్వీట్‌ చేశారు వర్మ. రియల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ కేసీఆరేనని RGV పేర్కొన్నారు. బాహుబలి, RRR, PUSHPA మరియు KGF 2 సినిమాల అడుగుజాడలను అనుసరిస్తూ, TRS కూడా BRS గా పాన్ ఇండియాగా వెళుతుందని వెల్లడించారు.

రీల్‌ హీరోలు… యష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ లాగా కాకుండా రియల్ పాన్ ఇండియా పొలిటీకల్‌ స్టార్…కేసీఆరేనని తెలిపారు ఆర్జీవీ. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ వెళితే.. కచ్చితంగా విజయం సాధిస్తాడన్న.. అర్థం వచ్చేలా ఈ ట్వీట్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news