రియా చ‌క్ర‌వ‌ర్తి కొత్త ప్లాన్ వ‌ర్కవుట్ అవుతుందా?

బాలీవుడ్ ప్రామిసింగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతి దేశ వ్యాప్తంగా సంల‌చల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. సుశాంత్ మృతికి డ్ర‌గ్స్‌కి సంబంధం వుంద‌న్న అనుమానంతో రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ అనంత‌రం అరెస్ట్ చేసి జ్యుడీష‌య‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించారు. నెల రోజుల పాటు ఆమెకు రిమాండ్ విధించ‌డం బాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది.

నెల రోజుల పాటు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో వున్న రియా చ‌క్ర‌వ‌ర్తి ఫైన‌ల్‌గా బెయిల్ ల‌భించ‌డంతో విడుద‌లైంది. అమె ఇంట్లో ఎలాంటి డ్ర‌గ్స్ ల‌భించ‌క‌పోవ‌డం.. ఎన్సీబీ బ‌ల‌మైన ఆధారాలు చూపించ‌క‌పోవ‌డంతో రియాకు బెయిల్ మంజూరు చేశారు. గ‌త రెండు నెల‌లు హాట్ హాట్‌గా సాగిన రియా కేసుని ప్ర‌స్తుతం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

దీంతో త‌న కెరీర్‌ని మ‌ళ్లీ గాడిలో పెట్టాల‌ని రియా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింద‌ట‌. దేశ వ్యాప్తంగా త‌న పేరు మారుమ్రోగిపోవ‌డంతో త‌న‌కు క్రేజీ ఆఫ‌ర్లు ల‌భిస్తాయ‌ని భావిస్తోంద‌ట‌. మ‌రి రియా కొత్త ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. రియా చ‌క్ర‌వ‌ర్తి తెలుగులో ఎం.ఎస్‌. రాజు నిర్మించిన `తూనీగ తూనీగ‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత బాలీవుడ్‌కు త‌న మ‌కాం మార్చేసి అక్క‌డ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లుపెట్టింది. రియా న‌టించిన తాజా చిత్రం `చెహ‌రే`. అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఇమ్రాన్ హ‌ష్మీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.