ఫాంలోకి వస్తున్న రాక్ స్టార్ ..గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ రిపీట్ ..!

-

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా దేవీ హవా కొనసాగడం లేదు. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడన్న టాక్ బాగా వైరల్ అయింది. సినిమాని సగం దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సక్సస్ ట్రాక్ లోకి తీసుకు వస్తుంది. హీరో ఎవరైనా ఆ హీరో ఎనర్జీకి తగ్గట్టు సాంగ్స్ కంపోజ్ చేయడంలో ఈ రాక్ స్టార్ స్టైలే వేరు. ఇక తను ప్రత్యేకంగా కంపోజ్ చేసే ఐటం సాంగ్ యూత్ తో పాటు ప్రేక్షకులందరిని ఒక ఊపు ఊపేస్తుంది.

అయితే రంగస్థలం తర్వాత మళ్ళీ దేవీ అంతగా తన మ్యాజిక్ ని చూపించలేకపోతున్నాడు. మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలకి ఇచ్చిన మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోదన్న టాక్ వచ్చింది. అదే సమయంలో థమ తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. చెప్పాలంటే దేవీశ్రీప్రసాద్ కి గట్టి పోటీగా నిలబడ్డాడు. దాంతో రెగ్యులర్ గా దేవీతో సినిమాలు చేయించుకున్న దర్శకులు కూడా కాస్త పక్కనపెట్టారు.

అయితే దేవీశ్రీప్రసాద్ ని సుకుమార్ మాత్రం వదలడం లేదు. తను నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాతో పాటు తన దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాకి సంగీత దర్శకుడిగా దేవీకే అవకాశం ఇచ్చాడు. అయితే ఉప్పెన సినిమాలో దేవీ కంపోజ్ చేసిన సాంగ్ సెన్షేషన్ అవుతోంది. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అంతేకాదు ఇటీవల హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ – దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకి 8 ఏళ్ళు కంపీటయ్యాయి. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మనం మళ్ళీ కలిసి పనిచేయబోతున్నాం అంటూ దేవికి క్లారిటి ఇచ్చాడు. దీంతో ఇండస్ట్రీలో మళ్ళీ దేవిశ్రీప్రసాద్ హవా మొదలవబోతుందని హాట్ టాపిక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news