అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి తండ్రిని సర్ప్రైజ్ చేసిన రోహిణి..!!

-

బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ రోహిణి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా ప్రేక్షకులను మెప్పించింది. మొదట్లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో తన మాట తీరుతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత పలు సీరియల్స్ లో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో మాటీవీలో శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్ తో కామెడీ కాకుండా తనలోని నటస్వరూపాన్ని చూపించి అందరినీ అబ్బురపరిచింది. ఇక తర్వాత ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో కూడా పోలీస్ పాత్రలో నటించి.. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ద్వారా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.

కేవలం సీరియల్స్ లోనే కాదు సినిమాలలో కూడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి అలరించిన రోహిణి, జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక కేవలం ఈటీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందరికీ అందుబాటులో ఉండే ఈమె యూట్యూబ్లో తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంది. ఇక అందులో తాను చేసే ప్రతి విషయాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గర అవ్వడమే కాకుండా తన ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంది. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఇక ఏ పండుగ జరిగినా సరే వాటిని సరదాగా వీడియో రూపంలో యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తన తండ్రికి ఒక కొత్త బైకును కొనిచ్చింది.. తన తమ్ముడితో స్వయంగా షోరూం కి వెళ్లి తన తండ్రి గతంలో కోరిన బైకును తీసుకొచ్చి ఆయనను సర్ప్రైజ్ చేసింది. అంతేకాదు తన తండ్రి బైకుపై ఒక ట్రిప్ కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే తన సంపాదనతో తన తండ్రికి బైకు కొని తండ్రి కోరికను తీర్చింది. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈమెపై నెటిజన్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news