జబర్దస్త్ కు రోజా వచ్చేసిందోచ్..!

-

ఈటివి కామెడీ షో జబరస్త్ ఏ ముహుర్తాన మొదలుపెట్టారో కాని తెలుగులో కామెడీ షోల్లో నంబర్ 1గా కొనసాగుతుంది. ఆ షోలో కమెడియన్స్ కు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. స్కిట్స్ వేసే కమెడియన్స్ తో పాటుగా జడ్జులుగా చేస్తున్న నాగబాబు, రోజాలకు జబర్దస్త్ తో ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఐదేళ్లుగా నిరతతారాయంగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న జబర్దస్త్ షో సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు.

అయితే ఇన్నేళ్లలో జబర్దస్త్ జడ్జులు నాగబాబు, రోజా షోని విడిచి పెట్టింది లేదు. ఏదో ఒకటి రెండు ఎపిసోడ్స్ ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప అలా జరుగదు. కాని ఏపి ఎలక్షన్స్ టైంలో ఎంపిగా నాగబాబు, ఎమ్మెల్యేగా రోజా ఇద్దరు పోటీ చేయడంతో జబర్దస్త్ కు బంక్ కొట్టారు. నాగబాబు రీ ఎంట్రీ ఛాన్స్ ఉంది కాని రోజాకు లేదని కొన్ని వార్తలు వచ్చాయి. కాని రీసెంట్ ప్రోమో చూస్తే శేఖర్ మాస్టర్ బదులుగా రోజా వచ్చేసింది.

ఇద్దరు లేడీ యాంకర్స్ తో షో నడుస్తుందన్నమాట. ఓ పక్క జబర్దస్త్ కు అడల్ట్ కామెడీ షో అన్న టాక్ ఉంది అలాంటిది ఆ షోకి జడ్జులుగా ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ రావడం విశేషం. రోజా రీ ఎంట్రీ ఫ్యాన్స్ కు ఫుల్ హ్యాపీ. మరి నాగబాబు రీ ఎంట్రీ ఎప్పుడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news