అవును.. మీరు చదివింది నిజమే. మేం చెప్పింది కూడా నిజమే. జస్ట్ ఓ ఇయర్ రింగ్ పెట్టుకుంటే చాలు.. మీకు పిల్లలు కావాలన్నా పుట్టరు. పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆ మాత్రలు, ఈ మాత్రలు వేసుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకునే బదులు సింపుల్ గా ఓ ఇయర్ రింగ్ పెట్టుకుంటే చాలు… పిల్లలు కారు. చదవడానికి షాకింగ్ గా ఉన్నా ఇది వందకు వంద శాతం నిజం.
అయితే.. అదేదో ఉత్త రింగ్ కాదండోయ్. దాంట్లో ఓ మతలబు ఉంది. అది ఫార్మా రింగ్. దాంట్లో గర్భనిరోధకత కోసం చిన్న టాబ్లెట్ ను అమర్చుతారు. దాన్ని పెట్టుకోగానే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ ట్యాబ్లెట్ లో ఉన్న హార్మోన్స్ చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లి గర్భం రాకుండా నిరోధిస్తాయన్నమాట. దాన్నే కాంట్రాసెప్టివ్ జ్యూయెలరీ లేదా ఫార్మాస్యుటికల్ జ్యూయెలరీ అని పిలుస్తారు.
ఒక ఇయర్ రింగ్సే కాదు.. చేతికి పెట్టుకునే రింగులు, వాచీలు, ఇతర నగల్లోనూ వాటిని ఫిక్స్ చేస్తారు. వాటిని ధరించగానే ఆ హార్మోన్లు చర్మం నుంచి శరీరంలోకి వెళ్తాయన్నమాట. ఈ ప్రయోగాన్ని చేసింది జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
అయితే.. ఈ ప్రయోగాన్ని ఇప్పటి వరకు మనుషుల మీద చేయలేదట. పందులు, ఎలుకలపై మాత్రం చేశారట. వాటిపై చేస్తే ఫలితాలు సరిగ్గానే వచ్చాయట. ఇక తరువాయి.. మనుషుల మీద ప్రయోగించడమే. ఒకవేళ అది సక్సెస్ అయితే.. ఈ ప్రాడక్ట్ మార్కెట్ లోకి వచ్చేసినట్టే.