Unstoppable With NBK: బాలయ్య షోలో ర‌చ్చ‌బండ రోజా.. ఇక ద‌బ్బిడ‌దిబ్బ‌డే..!

-

Unstoppable With NBK: నటసింహ నందమూరి బాలకృష్ణ.. తాజాగా హోస్ట్ గా అవ‌తారమెత్తిన విష‌యం తెలిసిందే. తెలుగు ఓటీటీ ఆహా లో ప్ర‌సార‌మ‌వుతున్న ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో లో బాల‌కృష్ణ హోస్ట్ గా ప‌లువురు సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూలు చేస్తూ తెగ సంద‌డి చేస్తున్నారు. ఈ షోలో తొలి గెస్ట్ గా మోహ‌న్ బాబు వ‌చ్చారు. ఈ ఎపిసోడ్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక ఈ షోకి రెండవ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్లో నాని, బాల‌య్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. షో మీద హైప్స్ క్రియేట్ అయ్యాయి. అల్టిమేట్ రేటింగ్ తెచ్చుకున్నాయి ఈ ఎపిసోడ్. బాలకృష్ణ పంచ్ లు, జోకులతో షో అంతా దద్దరిల్లింది.

దీంతో రానున్న రోజుల‌లో ఈ షోకి రాబోయే గెస్టులెవ‌ర‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ముచ్చ‌ట‌గా మూడో గెస్ట్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ రానున్నాడ‌నే టాక్. త్వరలోనే ఆహా వారు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ షో కి నటి రోజా గెస్ట్ గా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. బాలయ్య‌.. రోజా పుట్టిన రోజు నాడు స్పెషల్ గా ఫోన్ చేసి విషెస్ చెప్పి.. తమ షోకి ఇన్వైట్ చేశార‌ట‌. అందుకు రోజా సైతం ఒప్పుకున్నదనే స‌మాచారం.

బాల‌కృష్ణ‌, రోజాలు అనగానే గుర్తుకు వ‌చ్చేవి.. బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం, పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి హిట్ మూవీ. అంతే కాకుండా వీరిద్ద‌రూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులు. దీంతో ఈ రోజాతో బాలయ్య చేసే ఇంట‌ర్య్వూ ఎలా ఉండ‌బోతుంది. ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించనున్న‌ర‌నేది ఆస‌క్త‌క‌రంగా మారింది. ఇక ఈ ఎపిసోడ్ ద‌బ్బిడ‌దిబ్బ‌డే అంటున్నారు ఈ షో అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news