సినీ నటి చౌరాసియాపై దాడి కేసులో మరో ట్విస్ట్ !

-

కేబీఆర్ పార్క్ సినీ నటి ఛౌరాసియా పై దాడి కేసులో పురోగతి లభించింది. వారం రోజుల పోలీసుల అన్వేషణ తర్వాత నిందితుడు లభ్యం అయ్యాడు. సినీ నటి ఛౌరాసియా పై దాడి చేసిన నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సినీ నటి ఛౌరాసియా పై దాడి చేసిన వ్యక్తి బాబు గా గుర్తించారు పోలీసులు.

హైదరాబాద్ కృష్ణా నగర్‌ లో ఓ నివాసంలో కిరాయికి ఉంటున్నాడు నిందితుడు బాబు. సినిమాల్లో లైట్‌ మెన్‌ గా పని చేస్తున్నాడు బాబు. నటి ఛౌరాసియా పై దాడి చేసి… సెల్ ఫోన్ లాక్కెళ్లాడు బాబు. ఈ సంఘటన తర్వాత కృష్ణా నగర్ ఇంటికి వెళ్లాడు బాబు. కెబీఆర్ పార్క్ సిసి కెమెరాలు పని చేయకపోవడంతో గుర్తించడంలో ఆలస్యం అయింది. ప్రస్తుతం నిందితుడు బాబు గత నేర చరిత్ర పై ఆరా తీస్తున్నాడు పోలీసులు. కాగా.. గత వారంలో రోజుల కింద.. సినీ నటి ఛౌరాసియా పై కేబిఆర్‌ పార్క్‌ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news