మెగాస్టార్‌కు మ‌ద్ద‌తుగా రౌడీ హీరో ట్వీట్

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జ‌గ‌న్ రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేశార‌నే వార్త‌లు గ‌త రెండు రోజుల నుంచి వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌ను కాసేప‌టి క్రిత‌మే మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. అలాంటి వార్త‌లును న‌మ్మ‌వ‌ద్దు అని చిరంజీవి అభిమానుల‌ను కోరారు. అలాగే #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు. అయితే ప్ర‌స్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ సోష‌ల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు కూడా #GiveNewsNotViews తో ట్వీట్స్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవికి మ‌ద్ద‌తు తెలిపారు. తాజా గా రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా మెగాస్టార్ చిరంజీవికి మ‌ద్ద‌తు తెలిపారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా త‌ను పూర్తి మ‌ద్దతు ఉంటుందంటూ హ్యాష్ ట్యాగ్ ను జోడించాడు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ మ‌రింత ట్రెండ్ అవుతుంది.

 

అయితే సినిమా ప‌రిశ్ర‌మ క‌ష్టాలను చ‌ర్చించ‌డానికి సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం అవుతే.. ఈ విష‌యాన్ని పక్క‌దోవ ప‌ట్టించ‌డానికి కొంత మంది త‌న‌కు రాజ్య స‌భ ఎంపీ ఆఫ‌ర్ అంటు ప్రచారం చేస్తున్నార‌ని చిరంజీవి అన్నారు. న్యూస్ ఇవ్వండి కానీ.. వ్యూస్ కోసం వార్త‌లు ఇవ్వ‌కండి అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు.