
పరకాల నియోజకవర్గంలో నడికూడ మండలంలోని పలు గ్రామాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. మూడు వేల ఎకరాల్లో పంటలు నష్టపోయామని రైతులు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారులతో నష్టపరిహారాన్ని సర్వే చేయించి తప్పకుండా నష్టపరిహారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.