ఆర్ఆర్ఆర్ “రౌద్రం రణం రుధిరం” మోషన్ పోస్టర్ అదిరిపోయింది

113

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నందమూరి అభిమానులు మెగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా… టైటిల్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది. కనీసం ఫస్ట్ లుక్ కోసం అయినా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ పోస్టర్ ద్వారా కాస్త ఉపశమనం లభించింది .

రౌద్రం రణం రుదిరం అనే ఫుల్ ఫార్మ్ ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఒక నిమిషం 15 సెకన్లు ఉన్న ఈ మోషన్ పోస్టర్ వీడియో పోస్ట్ చేసిన వెంటనే లక్ష వ్యూస్ సాధించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ యుట్యూబ్ ఛానల్ లో దీన్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో హీరోలు ఇద్దరూ పోరాటం కోసం పరిగెడుతున్న విధంగా చూపించాడు జక్కన్న.

ఈ పోస్టర్ టైటిల్ లో రామ్ చరణ్ సైడ్ లో లుక్ ని చూపించారు. ఎప్పటి నుంచో ప్రేక్షకులు టైటిల్ ఏంటి ఏంటీ అని ఎదురు చూస్తున్నారు. అయినా సరే జక్కన్న ఎక్కడా కూడా కొంచెం లీక్ కూడా ఇవ్వలేదు. ఉగాది కానుకగా ప్రకటన ఉంటుంది అని ముందుగానే చెప్పిన చిత్ర యూనిట్ చెప్పిన తేదీ కి విడుదల చేసింది. ఈ నెల 28 న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని కూడా అతని పుట్టిన రోజు కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది.