ఆ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ సెన్సేషనల్ రికార్డు….!!

-

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ 70 శాతం పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుని, అతి త్వరలో తాజా షెడ్యూల్ కి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ మరియు మెయిన్ విలన్, అలానే లేడీ విలన్ లను ప్రకటించిన సినిమా యూనిట్, ముందుగా అనుకున్న విధంగానే వచ్చే ఏడాది జులై 30న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా విషయమై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, సినిమా బడ్జెట్ లో దాదాపుగా 40 శాతం డబ్బు ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కే ఖర్చు చేస్తున్నారట. ఇక మిగిలిన 60 శాతం డబ్బును అసలు సినిమా కాస్ట్ గా చెప్తున్నారు. వాస్తవానికి మొదట రూ.400 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైన ఈ సినిమా, ఆ తరువాత రూ.50 కోట్లు పెరిగిందని, అయితే ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఆర్టిస్టులు మరియు మరికొంత ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరగనుండడంతో మరొక రూ.50 కోట్లు పెరిగి ఓవర్ అల్ గా సినిమా మొత్తం బడ్జెట్ రూ.500 కోట్లకు చేరుకుందని అంటున్నారు.

ఇక ఈ విధంగా ఇన్నికోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ఆర్ఆర్ఆర్ సినిమా, ఇప్పటివరకు భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ సినిమాగా ప్రధమ స్థానంలో నిలవనుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక దీని తరువాత స్థానంలో ఇటీవల రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్లో వచ్చిన 2.0 రూ.400 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. తొలిసారి మెగా, నందమూరి ఫ్యామిలీల స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ హిస్టారికల్ మూవీ, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news