BREAKING : “ఆర్ఆర్ఆర్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫ్యాన్స్ కు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రెండు సార్లు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్న చిత్రబృందం… తాజాగా మరో సారి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో… మార్చి 25వ తేదీన… ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మేరకు ఓ పోస్టర్లు కూడా వద్దులేండి చిత్రబృందం. మార్చి 25వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఈ అప్ డేట్ తో… టాలీవుడ్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది.

కాగా ఈ సినిమా.. రెండుసార్లు విడుదలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. 2021 దసరా కానుకగా మొదట్లో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ కరోనా కేసుల నేపథ్యంలో వాయిదా వేసుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ముందు అనుకున్నప్పటికీ… థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news