RRR నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

-

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చి వారి విశేష ఆదరణ పొందుతోంది. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో మార్చి నెల 25న విడుదలైన పిక్చర్.. అంచనాలకు మించిన విజయాన్ని అప్పుడే సాధించి, రికార్డుల వేటలో తలమునకలైంది. వరల్డ్‌ వైడ్‌ గా సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించడం జరిగింది. ఈ సినిమాను అక్టోబర్‌ 21, 2022 న జపాన్‌ లో రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఎంఎం కీరవాణీ అందించిన ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌, శ్రియ శరణ్‌, సముద్ర ఖని, రాహుల్‌ రామకృష్ణ తదితులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జపాన్‌ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news