చైతూకు షాక్..రెండో పెళ్లికి సిద్ధమైన సమంత..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఇకపోతే తాను ప్రేమించిన నాగచైతన్యను వివాహం చేసుకొని ఆ తరువాత విడాకులు తీసుకుంది. ఇక విడాకుల తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా పడి లేచిన కెరటంలా వరుస అవకాశాలు అందుకుంటూ తన సినీ కెరియర్లో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా ఉండగా… గత రెండు మూడు రోజులుగా ఓ కొత్త పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ మధ్య సమంత పై ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారని.. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే సామ్.. సోషల్ మీడియాకు దూరంగా ఉందని టాక్.

ఇక్కడ మరో గాసిప్ ఏంటంటే.. సమంత అమ్మతనానికి దూరంగా ఉండడానికి షాకింగ్ డెషిషన్ తీసుకుందని కూడా భోగట్టా. అయితే ఇలాంటి వార్తల్లో అసలు నిజముందా.. అనేది అర్థం కాని విషయమే. సామ్ సైలెంట్‌ అయిపోయినా.. పుకార్లు మాత్రం ఆగడం లేదు. దీనిపై సమంతనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.