‘రూలర్’ తో బాక్సాఫీస్ ని రూల్ చేయడం ఖాయమట….!!

-

యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ సినిమా రూలర్. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో రెండు వరుస ఫ్లాప్స్ చవిచూసిన బాలకృష్ణ, తదుపరి సినిమా విషయమై కొంత ఆలోచన చేసి, చివరికి గత ఏడాది తనకు జైసింహా వంటి మంచి హిట్ ని అందించిన కేఎస్ రవికుమార్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుతం రూలర్ పేరుతో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. బాలకృష్ణ సరసన ఇదివరకు లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించిన సోనాల్ చౌహన్,

మరొక్కారిగా ఆయనతో జతకడుతోంది. మరొక హీరోయిన్ గా వేదిక నటిస్తున్న ఈ సినిమాలో భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా టీజర్ ని, ఆ తరువాత ఒక్కొక్కటిగా సాంగ్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయనుందట సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుకునే మాస్,

కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఇక మ్యూజికల్ గా కూడా సినిమా అదిరిపోతుందని, రెండు వరుస ఫ్లాప్స్ తరువాత రాబోతున్న ఈ రూలర్ సినిమా, తప్పకుండా రిలీజ్ తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ ని రూల్ చేయడం ఖాయమని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. మరి బాలకృష్ణ ఈ సారి ఎంతమేర తన ఫ్యాన్స్ కి మంచి హిట్ అందిస్తారో చూడాలి…. !!

Read more RELATED
Recommended to you

Latest news