ఆరెక్స్ 100 కార్తికేయ.. ‘గుణ 369’ ఫస్ట్ లుక్ అదిరింది..!

-

ఆరెక్స్ 100 సినిమాతో హీరోగా సత్తా చాటిన కార్తికేయ రెండవ సినిమాగా హిప్పి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు కార్తికేయ 3వ సినిమా మొదలైంది. ఈ సినిమాకు టైటిల్ గా గుణ 369 అని ఫిక్స్ చేశారు. ఈ సినిమా కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించే సినిమా అని తెలుస్తుంది. అర్జున్ జంద్యాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తిరుమల్ రెడ్డి, అనీల్ కడియాల నిర్మిస్తున్నారు.

గుణ 369 ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది. కండలు తిరిగే దేహంతో కార్తికేయ తన వెనుక లుక్ తోనే ఇంప్రెస్ చేశాడు. చూస్తుంటే ఈ సినిమా కూడా ఆరెక్స్ 100 మాదిరిగా సెన్సేషన్ సినిమా అయ్యేట్టు ఉంది. హీరోయిన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో వెళ్లడిస్తారట. మొత్తానికి కార్తికేయ గుణ 369 ఫస్ట్ లుక్ అదిరిపోయింది. చూస్తుంటే కుర్రాడు కథల విషయంలో జాగ్రత్త పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ దృష్టిలో పెట్టుకుని కార్తికేయ సినిమాలు చేస్తున్నాడని అతని సినిమాలను చూస్తే అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news