రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

-

ఇవాళ సమస్తిపూర్(బీహార్), బాలాసోర్(ఒడిశా), సంగమ్ నెర్(మహారాష్ట్ర)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. కానీ.. విమానం ట్రబుల్ ఇచ్చింది. సభలు జరుగుతాయి కానీ.. లేట్ అవ్వొచ్చు. సభలు ఆలస్యం అవుతున్నందుకు నన్ను క్షమించాలి.. అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానం ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Engine Issue arises in rahul gandhi flight on the way to patna

నిజానికి రాహుల్ గాంధీ ఇవాళ పాట్నాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. దాని కోసమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయలు దేరారు. కానీ.. మధ్యలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో చేసేది లేక విమానాన్ని మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లి ల్యాండింగ్ చేశారు.

ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఇవాళ సమస్తిపూర్(బీహార్), బాలాసోర్(ఒడిశా), సంగమ్ నెర్(మహారాష్ట్ర)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. కానీ.. విమానం ట్రబుల్ ఇచ్చింది. సభలు జరుగుతాయి కానీ.. లేట్ అవ్వొచ్చు. సభలు ఆలస్యం అవుతున్నందుకు నన్ను క్షమించాలి.. అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news