సాహో డైరెక్టర్ బాలీవుడ్ ప్రయత్నాలు.. ఆ హీరో ఒప్పుకుంటే సెటిలైనట్లే..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో సినిమా చేసిన సుజిత్, ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సాహో సినిమా దక్షిణాదిన అంతగా ఆకట్టుకోకపోయినా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. ఉత్తరాది వారిని సాహో సినిమా బాగా ఆకట్టుకుంది. ఐతే సాహో సినిమా వచ్చి ఏడాది పూర్తవుతున్నా సుజిత్ రెండవ చిత్రం మాత్రం మొదలు కాలేదు. మెగాస్టార్ చిరంజీవితో లూసిఫర్ తెలుగు రీమేక్ తెరకెక్కిస్తాడని వార్తలు వచ్చినప్పటికీ, ఆ తర్వాత అదెందుకో క్యాన్సిల్ అయ్యింది.

ప్రస్తుతం సుజిత్, బాలీవుడ్ హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు. యురి సినిమాతో ఫేమ్ అయిన విక్కీ కౌషల్ హీరోగా సినిమా రూపొందించాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి తెలుగులో హిట్ కొట్టలేకపోయిన సుజిత్, బాలీవుడ్ లో హిట్టు కొడతాడా లేదా చూడాలి. ఒకవేళ విక్కీ కౌషల్ ఒప్పుకుంటే బాలీవుడ్ లో సుజిత్ పాగా వేయడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news