ఈ ఏడాదికే బిగ్గెస్ట్ ఈవెంట్‌గా సాహో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌.. వేదిక‌, ముహుర్తం ఖ‌రారు..!

358

సాహో మూవీని ఈ నెల 30వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తుండ‌గా, ఈ మూవీకి గాను ఈ నెల 18వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించనున్నారు.

బాహుబ‌లి మూవీ త‌రువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్ర‌భాస్ మ‌ళ్లీ సాహో మూవీతో సంద‌డి చేయ‌నున్నాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు అన్ని వ‌ర్గాల సినీ ప్రేక్ష‌కుల నుంచి విశేష రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు ఈ మూవీపై భారీ అంచ‌నాల‌ను పెట్టుకున్నారు. అయితే బాహుబ‌లి మూవీ త‌రువాత మ‌ళ్లీ ఇన్ని రోజుల‌కు ప్ర‌భాస్‌ను వెండితెర‌పై చూసే భాగ్యం ద‌క్కుతుండ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

saaho pre release event venue time fixed

సాహో మూవీని ఈ నెల 30వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తుండ‌గా, ఈ మూవీకి గాను ఈ నెల 18వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంట‌ల‌కు హైద‌రాబాద్ శివారులోని రామోజీ ఫిలిం సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ గ‌త కొంత సేప‌టి క్రిత‌మే ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది. ఇక ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు చెందిన పోస్ట‌ర్ల‌ను 4 భాష‌ల్లో రిలీజ్ కూడా చేశారు.

కాగా సాహో మూవీ ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా ఇటీవ‌లే చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో సంద‌డి చేసింది. ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్, చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కులు ప్రెస్ మీట్‌ల‌లో పాల్గొని విలేక‌రుల‌తో మాట్లాడారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సాహోకు విస్తృత‌మైన ప‌బ్లిసిటీ క‌ల్పించ‌నున్నారు. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ట్వీట్ చేసిన యూవీ క్రియేష‌న్స్‌.. ఆ పోస్టులో.. 2019 బిగ్గెస్ట్ నైట్‌కి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 18న సాయంత్రం 5 గంటల నుంచి సాహో ప్రీ రిలీజ్ వేడుకతో సాహోను సెలబ్రేట్ చేసుకుందాం.. అంటూ కామెంట్ పెట్టింది. దీన్ని బ‌ట్టి చూస్తే సాహో ప్రీ రిలీజ్ వేడుక‌ను భారీగానే నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. మరి బాక్సాఫీస్ వ‌ద్ద సాహో మూవీ అభిమానుల అంచ‌నాల‌ను అందుకుంటుందా.. లేదా.. చూడాలి..!