బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ టెండూల్కర్ కూతురు సారా..?

-

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.సారా త్వరలో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది.సారా కి ఇంస్టాగ్రామ్ లో 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.అందుకే ఆమె పిక్స్ పెట్టిన వెంటనే అవి లక్షల్లో లైకులు, షేర్లతో వైరల్ గా మారుతూ ఉంటాయి.అంతేకాకుండా చాలా మంది ఈ భామని అప్పుడప్పుడు కాకుండా తరచుగా పిక్స్ అప్లోడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా వచ్చిన ఈ వార్తతో వారంతా ఖుషి గా ఉన్నారని టాక్. 24 ఏళ్ల సారా ఇటీవలె లండన్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్ లో పట్టా పొందింది.అంతే కాకుండా ఇప్పటికే మోడల్ గా రాణిస్తూ పలు యాడ్స్ లో కూడా నటించింది.

అందులో ఆమె నటనకి ఎంతోమంది షాక్ అవుతుంటారు.దీంతో ఈ స్టార్ కిడ్ బాలీవుడ్ ఎంట్రీ పై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.నిజానికి గతంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం కానుందని ప్రచారం జరిగింది.దీంతో సచిన్ రంగంలోకి దిగి తన కూతురు సారా సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చారు.అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు.అంతే కాకుండా సారా చదువుపై కాన్సన్ట్రేషన్ చేస్తోందని, తర్వాత ఏం చేస్తుంది అనేది ఆమె ఇష్టం అని సచిన్ చెప్పుకొచ్చారు.కాగా ఈ న్యూస్ అయినా నిజమవుతుందా లేక రూమర్ గానే మిగిలిపోతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news