బాబోయ్ : యుట్యూబ్ చరిత్రలో వరస్టు ట్రైలర్ ఇదే

-

బాలీవుడ్‌ కి సుశాంత్ డెత్ మామూలుగా ఇబ్బంది పెట్టడం లేదు. టాలెంట్‌ ఉన్న నటుడు కేవలం నేపోటిజం కారణంగా మరణించాడని దాని వల్లే సుశాంత్‌ సూసైడ్ చేసుకు చనిపోయాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య మీద సీబీఐ ఎంక్వైరీ జరుగుతోంది. ఈయన సూసైడ్ వెనుక గర్ల్ ఫ్రెండ్ రియా కూడా ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అంతే కాక మహేష్ భట్ ని కూడా ఈ విషయంలో ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా ఈయన దర్శక నిర్మాతగా తెరకెక్కిన ‘సడక్ 2’ట్రైలర్ ఈ రోజు విడులైంది. సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌ లైక్‌ లు వస్తున్నాయి. యట్యూబ్ చరిత్రలో ఇంత మునుపెన్నడూ ఏ సినిమా ట్రైలర్ కి రానంతగా దీనికి వస్తున్నాయి. ‘సడక్ 2’ట్రైలర్ డిస్ లైక్ ల రికార్డు కొనసాగుతోంది. ఇప్పటి దాకా రెండు లక్షల మంది లైక్ చేయగా దాదాపు మూడు మిలయన్ పైగా డిస్ లైక్స్ వచ్చాయి. ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news