ఆ హీరోయిన్ మాజి భర్తతో సాయి పల్లవి పెళ్లి.. ఫ్యాన్స్ ఫైర్..!

మళయాళ ప్రేమంతో అందరిని అలరించి ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తో అదరగొడుతున్న సాయి పల్లవి గురించి ఓ క్రేజీ రూమర్ కోలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది. అమలా పాల్ మాజి భర్త ఏ.ఎల్. విజయ్ ను సాయి పల్లవి పెళ్లాడుతుందని వార్తలు వస్తున్నాయి.


అమలా పాల్ తో ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి.. ఆ వెంటనే విడాకులు ఇలాంటి వివాదాస్పద దర్శకుడైన విజయ్ మళ్లీ సాయి పల్లవితో ప్రేమాయణం నడిపించడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ ను కొట్టిపారేస్తున్నారు.సాయి పల్లవి నటించిన కణం సినిమా డైరెక్ట్ చేశాడు విజయ్ ఆ సినిమా టైంలో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని అందుకే ఇద్దరు పెళ్లికి సిద్ధమయ్యారని వార్తల సారాంశం.అసలు పెళ్లే చేసుకోను అంటున్న సాయి పల్లవికి ఎవరిని పడితే వాడికి ఎలా అంటకడతారని ఫైర్ అవుతున్నారు. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేని సాయి పల్లవి గురించి ఇలా దర్శకుడితో పెళ్లంటూ వార్తలు రావడం బహుశా ఆమెను కూడా షాక్ అయ్యేలా చేస్తాయని చెప్పొచ్చు.