జగన్ చేసిన ఆ పనితో ఆ వర్గం ఓట్లన్నీ వైసీపీకే పడనున్నాయి..!

ప్రతి రాజకీయ పార్టీ ప్రతి వర్గానికి సమానమైన ప్రాధాన్యత ఇస్తే.. అన్ని వర్గాలను ఆదుకుంటే.. ఏ వర్గం ప్రజలైనా ఆ పార్టీకి పట్టం కడతారా?

అఫ్ కోర్స్ రాజకీయాలు అంటే అన్నీ ఉంటాయి. కులాలు, వర్గాలు, ప్రాంతాలు.. ఇలా ఎన్నో సమీకరణాలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగేదే రాజకీయ పార్టీ. అయితే.. టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ రచయిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమయ్యాయి.


సరే.. ఆయన తన పర్సనల్ విషయాలు కూడా చెప్పారు.. అవి మనకు అవసరం లేదు కానీ.. ఆయన ఏపీ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యల గురించి ఓసారి మాట్లాడుకుందాం.చంద్రబాబు బ్రాహ్మణుల ద్వేషి. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బ్రాహ్మణులకు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వలేదు చంద్రబాబు. బ్రాహ్మణులు రాజకీయాలకు పనికిరారు అన్న భావన చంద్రబాబుది.. అని ఆ రచయిత వెల్లడించారు.ఆ తర్వాత జగన్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత రాజకీయాల్లో తాను చూసిన మంచి రాజకీయ నేతల్లో జగన్ ఒకరు అని ఆయన కొనియాడారు. జగన్ తన పార్టీలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అంతే కాదు.. బ్రాహ్మణులకు అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాలు.. విజయవాడ, వైజాగ్, బాపట్ల వంటి ప్రాంతాల్లో సీట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకే… బ్రాహ్మణ వర్గమంతా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టడం ఖాయం అని ఆయన తేల్చి చెప్పారు. ఇంతకీ ఆ రచయిత ఎవరు అంటారా? పలు సూపర్ హిట్ సినిమాలకు కథ అందించిన రచయిత కోన వెంకట్.