సాయి ప‌ల్ల‌వి ఆ ఇద్ద‌రికి నో చెప్పేసిందా‌?

సాయి ప‌ల్ల‌వి తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది. సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నసాయి ప‌ల్ల‌వి తాజాగా వ‌రుస‌గా క్రేజీ స్టార్ల‌కు, క్రేజీ ద‌ర్శ‌కుల‌కు షాకుల మీద షాకులిస్తోంది. ఎంత‌టి స్టార్ పిలిచి ఆఫ‌రిచ్చినా పాత్ర న‌చ్చ‌లేదంటే నిర్మొహ‌మాటంగా తిరస్క‌రిస్తోంది.

తాజాగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి, నిర్మాత దిల్ రాజుకు భారీ ఝ‌ల‌క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. `ఎఫ్‌2` , `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి వ‌రుస హిట్‌ల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. ప్ర‌స్తుతం `ఎఫ్‌2`కు సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నఆయ‌న వెంక‌టేష్‌, వ‌రుణ్‌‌తేజ్ ఇత‌ర చిత్రాల్లో బిజీగా వుండ‌టంతో ఈ గ్యాప్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ని రూపొందించాల‌ని ప్లాన్ చేశాడ‌ట‌.

ఇందు కోసం టాలెంటెడ్ ఆర్టిస్ట్ సాయి ప‌ల్ల‌విని టైటిల్ పాత్ర కోసం అనిల్ రావిపూడి, దిల్ రాజు సంప్ర‌దించార‌ట‌. ఈ మూవీలో న‌టించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని సాయి ప‌ల్ల‌వి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. దిల్‌రాజు నిర్మించిన `ఫిదా` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌రువాత నాని న‌టించిన `ఎంసీఏ` చిత్రంలోనూ న‌టించింది. ఈ చిత్రాన్నికూడా దిల్ రాజు నిర్మించిన విష‌యం తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం `ల‌వ్‌స్టోరీ`, విరాట‌పర్వం చిత్రాల్లో న‌టిస్తోంది.