ప్రభాస్ ఫీస్ట్..‘‘సలార్’’ టీమ్‌కి పాన్ ఇండియా స్టార్ సర్‌ప్రైజ్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్..‘‘KGF’’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘‘సలార్’’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. నెక్స్ట్ లెవల్ లో ఈ సినిమా ఉంటుందని మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్సెస్ పైన ఫుల్ ఫోకస్ పెట్టారట.

ఇటీవల ప్రభాస్ నటించిన ‘‘రాధే శ్యామ్’’ చిత్రం విడుదలైంది. కానీ, అది అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కాగా, ‘‘సలార్’’ చిత్రానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

మర్యాద పురుషోత్తం ప్రభాస్ అనే ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఇందులో ప్రభాస్ వాయిస్ వినబడుతోంది. ప్రభాస్ ‘‘సలార్’’ మూవీ యూనిట్ సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. తన ఇంటి నుంచి అందరికీ ఫుడ్ తెప్పించాడు. ఆ ఫుడ్ తిని సభ్యులు ఫిదా అయిపోయారు. ఇది ప్రభాస్ ఫీస్ట్ అని అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరోయిన్ శ్రుతి హాసన్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ..ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ తిని వావ్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news