సినిమాల ద్వారా కాజల్ సంపాదించింది.. అక్షరాల అన్ని కోట్లా..?

-

తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చందమామ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో కాజల్ మాత్రమే కాదు సింధుతులాని , నవదీప్, శివబాలాజీ తదితరులు మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు.. అలాగే ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతం కిచ్లు ను ప్రేమించి వివాహం చేసుకుంది . ఇక వీరు నీల్ కిచ్లూ అనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈమె సినీ కెరీర్ లో సీనియర్ హీరోలతో మాత్రమే కాకుండా కుర్ర హీరోలతో కూడా నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది . ఇక 15 సంవత్సరాలకు పైగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది కాజల్ అగర్వాల్. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె ఈరోజు విడుదలైన ఆచార్యలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించారు. అయితే కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. Photo : Instagram

ఇకపోతే ఈ క్రమంలోనే సినిమాల ద్వారా ఎన్ని కోట్లు కూడబెట్టింది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాజల్ కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు అన్ని కలిపి సుమారుగారూ. 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ రేంజిలో ఆస్తులను కూడా పెట్టడం అనేది కేవలం హిందీ హీరోయిన్ లకు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ కాజల్ కూడా 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టినా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. కాజల్ అగర్వాల్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన కెరీర్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఆ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత అటు సంసార జీవితం సాగిస్తూనే మరో వైపు సినిమాల్లో నటించారు. ఇక ఇటీవలే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టుకున్నారు కాజల్. అది అలా ఉంటే కాన్పు తర్వాత కాజల్ మొదటి సారి తన తొలి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. Photo : Instagram

2020 లో వివాహం చేసుకున్న ఈమె సంసార జీవితాన్ని కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటించడానికి సిద్ధం అవుతోంది. ఇకపోతే మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ తొలి సారి తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news