టైటిల్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న సూప‌ర్‌స్టార్‌..!

-

ఒక సినిమా హిట్ లేదా ప్లాప్ అయితే చాలు దానిలో ఉన్న సెంటిమెంట్ ఎఫెక్ట్‌ను మ‌న టాలీవుడ్ హీరోల‌తో పాటు బాలీవుడ్ హీరోల వ‌ర‌కు అంతా ఫాలో అవుతారు. ఆ ఎఫెక్ట్ త‌మ త‌ర్వాతి సినిమాల‌పై ఉండ‌కుండా ప్లాన్‌చేసుకుంటారు. ఇందులో మ‌రీ ముఖ్యంగా టైటిల్ సెంటిమెంట్‌ను ఎక్కువ‌గా ఫాలో అవుతారు హీరోలు. ఇప్పుడు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ కూడా ఇదే విష‌యాన్ని ఫాలో అవుతున్నారు.

ఆయ‌న రీసెంట్‌గా చేసిన రాధే మూవీ విడుద‌ల‌యి ప్లాన్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. ఎన్నో అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ మూవీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆయ‌న చేస్తున్న మ‌రో భారీ ప్రాజెక్టుపై రాధే సెంటిమెంట్ ఎఫెక్ట్‌పై జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు స‌ల్మాన్ ఖాన్‌.

ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న కబీ ఈద్ కబీ దీవాలి సినిమాపై టైటిల్ సెంటిమెంట్‌న ఫాలో అవుతున్నారంట‌. ఇందులో స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే న‌టిస్తోంది. కాగా రాధే మూవీ టైటిల్ వ‌ద్ద‌ను కుని ఛేంజ్‌చేయ‌లేక‌పోవ‌డంతోనే ఆ ఎఫెక్ట్ వ‌చ్చింద‌ని, అందుకే ఇప్పుడు కబీ ఈద్ కబీ దీవాలి టైటిల్‌ను చేంజ్ చేయాల‌ని చూస్తున్నారంట‌. త్వ‌ర‌లోనే దీన్ని భాయిజాన్‌గా మారుస్తార‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news