అబుదాబి లో ఐఫా వేడుక‌లు.. హోస్ట్ గా స‌ల్మాన్ ఖాన్

బాలీవుడ్ లో ఎంతో ప్ర‌తిష్టాత్మకం గా నిర్వ‌హించే ఐఫా (ది ఇంటర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్) వేడుకల తేదీల ను నిర్వ‌హకులు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది మార్చి 18, 19 తేదీ ల‌లో 22వ‌ ఐఫా వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అలాగే ఈ వేడుక‌ల‌ను అబుదాబిలో ని య‌స్ ఐల్యాండ్స్ లో నిర్వ‌హిస్తామ‌ని నిర్వ‌హకులు తెలిపారు. ఈ ఐఫా వేడుక‌ల కు హోస్ట్ గా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని తెలిపారు.

అలాగే భార‌తీయ చిత్ర సీమ గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచ వ్యాప్తం గా చాటి చెప్పెలా ఐఫా వేడుక‌ల ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. కాగ ఈ సారి ఐఫా వేడుక‌ల స‌మ‌యంలో భార‌త్ 75 వ స్వ‌తంత్య్ర దినోత్స‌వం తో పాటు యూఏఈ 50 ఏళ్ల పండుగ కూడా రాబోతున్నయని.. కాబ‌ట్టి ఐఫా వేడుక‌ల ను మ‌రింత గ్రాండ్ గా ఫ్లాన్ చేస్తున్నామ‌ని నిర్వ‌హకులు తెలిపారు. కాగ ప్ర‌తి ఏడాది ఐఫా వేడుకుల‌ను బాలీవుడ్ ఆధ్వ‌ర్యం లో నిర్వ‌హిస్తారు. ఈ వేడుక‌ల‌లో సినిమా రంగంలోని ప‌లు విభాగాల్లో ఉత్తమ ప్ర‌ద‌ర్శన చేసిన వారికి అవార్డ్స్ ను ప్ర‌క‌టిస్తారు. అంతే కాకుండా ఈ ఐఫా వేడుక‌ల్లో బాలీవుడ్ న‌టీ న‌టుల ఆట పాట‌లు హైలైట్ గా నిలుస్తాయి.