సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

-

చైనాలో పురుడు పోసుకున్న.. కరోనా మహమ్మారి కారణంగా… చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే సంగతి తెలిసిందే. ముఖ్యంగా పేద ప్రజలు, చిన్న వ్యాపారస్తులు రోడ్డున పడ్డారు. అలాగే ఈ వైరస్ ప్రభావం సెక్స్ వర్కర్ల పై పై తీవ్రంగా పడింది. ఇదే జీవనాధారంగా బతుకుతున్న లక్షలమంది రోడ్డున పడ్డారు. వీరిలో చాలా మందికి రేషన్ కార్డులు కూడా లేవు.

దీంతో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లో వారందరికీ న్యాయం చేయాలంటూ దాఖలైన పిటీషన్ పై జస్టిస్ ఎల్ ఎన్ రావు, గెస్ హేమంత్ గుప్తా తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రేషన్ కార్డు లేకపోవడాన్ని మానవ తప్పిదం గా పరిగణించి వారంరోజులుగా వారికి అవసరమైన రేషన్ సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. అంతే కా కుండా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం వారికి ఆర్థిక సహాయం ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news