‘కింగ్ ఆఫ్ కోతా’ సినిమాలో రాముడితో యశోద..!

-

మాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న మళయాల సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం సినిమాలతో టాలీవుడ్ లోనూ తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. సీతారామంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న దుల్కర్ తదుపరి తన సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈ హీరో ‘కింగ్ ఆఫ్ కోతా’ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించాడు దుల్కర్ సల్మాన్. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకున్నట్లు సమాచారం. చాలా రోజుల క్రితమే సమంతను కలిసి దర్శకుడు కథ వినిపించినట్లు తెలుస్తోంది. సమంత కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news