పాపం చావు బ‌తుకుల్లో ఉన్న‌ త‌న‌ స్నేహితుడ్ని కాపాడుకోలేక‌పోయిన ధోనీ

-

ధోనీకి సంతోష్ లాల్ అంటే చాలా ఇష్టం. అయితే.. దురదృష్టవశాత్తు సంతోష్ లాల్ ఇప్పుడు లేడు. ఆయన 2013లోనే చనిపోయాడు. సంతోష్ లాల్ చనిపోవడం ధోనీని తీవ్రంగా కలిచివేసింది.

ఎంఎస్ ధోనీ.. ఆయనకు ఇవాళ్టితో 38 ఏళ్లు నిండాయి. సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగిన ధోనీ.. ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ గా చరిత్రకెక్కాడు. భారత క్రికెట్ చరిత్రను ఎక్కడికో తీసుకుపోయాడు. ధోనీ జీవితంలో ఎన్నో మ‌న‌సు క‌లిచి వేసే సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అందులో త‌న స్నేహితుడు సంతోష్‌ను కోల్పోవ‌డం. అప్ప‌టికి ధోనీ మంచి పొజీష‌న్‌లోనే ఉన్నాడు. స‌రైన వైద్యం అంద‌క సంతోష్ చ‌నిపోవ‌డం ధోనికి అత్యంత బాధ క‌లిగించే విష‌యం అట‌.

ప్రాంక్రియాటిస్‌తో బాధ‌ప‌తున్న సంతోష్ లాల్ దాదాపుగా చావు బ‌తుకుల్లో ఉన్నాడు. ఆ స‌మ‌యంలో ధోనీ ఏదో సిరిస్ కోసం వేరే దేశానికి వెళ్లిన సంద‌ర్భం అది. ధోనీకి విషయం తెలియడంతో కాస్త కంగారు పడ్డాడు. ఆట మీద ధ్యాస పెట్టలేకపోయాడు.
కానీ.. ఎలాగోలా సంతోష్ ను బతికించుకోవాలనుకున్నాడు. ఎంత ఖర్చు అయినా పెట్టడానికి ధోనీ వెనుకాడలేదు. దీంతో రాంచీ నుంచి స్పెషల్ హెలికాప్టర్ ను తెప్పించి… ఢిల్లీలోని మంచి ఆసుపత్రిలో చేర్పించాలని ధోనీ అనుకున్నాడు. కానీ.. వాతావరణం అనుకూలించక.. హెలికాప్టర్ వారణాసిలో నిలిచిపోవడంతో సంతోష్ కు వైద్యం అందడం లేట్ అయి ప్రాణాలు విడిచాడు.

ధోనీ బ్యాటింగ్ లో అందరికీ నచ్చేది హెలికాప్టర్ షాట్. హా.. ఆ షాట్ తోనే ధోనీ ఎక్కువ ఫేమస్. అయితే.. ఆ షాట్ ధోనీ నేర్చుకున్నది కాదు. ధోనీకి హెలికాప్టర్ షాట్ ను వేరే వ్యక్తి పరిచయం చేశాడున ఆ వ్యక్తి ఎవరో కాదు… ధోనీ స్కూల్ ఫ్రెండ్ సంతోష్ లాల్. అతడు కూడా క్రికెటరే. హెలికాఫ్ట‌ర్ షాట్ సంతోష్ నుండే ధోనీ నేర్చుకున్నాడు. ఈ విష‌యాన్ని ధోనీనే స్వ‌యంగా చాలా సార్లు చెప్పాడు కూడా..

హోదా, ప‌లుకుబ‌డి ఉండి కూడా స్నేహితున్ని కాపాడుకోలేక‌పోయాడు ధోనీ.. అన్నీ ఉండి కావాల్సిన వారిని కాపాడుకోలేకపోవ‌డం ఎంత బాధ‌క‌రం.. ధోనీ ఎంత బాధ ప‌డుంటాడో క‌దా..

Read more RELATED
Recommended to you

Latest news