అతనికి టైట్ హగ్ ఇచ్చి గాల్లో తేలిన సమంత…. పిక్ వైరల్!

ఎట్టకేలకు సమంత యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆమె అభిమానులు కొంత ధైర్యంగా ఉన్నారు. యశోద సినిమా కాస్త హిట్ టాక్ తెచ్చుకోవడంతో సమంత అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సమంత తన సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక వ్యక్తికి హగ్ ఇస్తూ దాని ఫోటో షేర్ చేయడం ఇప్పుడు మారింది.

అయితే అతను మరెవరో కాదు సమంత ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్. కొన్నాళ్ల నుంచి సమంతకు అతనే ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. సమంత బాడీ అంత ఫిట్ గా ఉండడానికి అలాగే యాక్షన్ సీన్స్ లో స్టిఫ్ గా ఆమె పెర్ఫార్మ్ చేయడానికి కూడా కారణం అతనేనట. ఈ విషయాన్ని సమంత వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పంచుకుంది నేను అతని చేతుల మీదుగా జిలేబి తింటానని అతను ఎప్పుడూ అనుకుని ఉండడు కానీ ఈరోజు అదే జరిగింది అంటూ ఆమె పేర్కొంది.

యశోద సక్సెస్ నేపధ్యములో అతను నాకు జిలేబీ తెచ్చి ఇచ్చాడని, ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ కోసం ఇది తెచ్చిచ్చాడని ఆమె పేర్కొంది. గత కొన్ని నెలలుగా నా బాధలు అన్నింటిని చూసిన కొద్ది మంది వ్యక్తులలో మీరు కూడా ఉన్నారని, నా అత్యల్ప స్థాయి… నా బలహీనత, కన్నీళ్లను, అధిక మోతాదు స్టెరాయిడ్ చికిత్సలను ఇలా అన్నింటినీ మీరు కూడా చూశారని సమంత పేర్కొంది. అయినా సరే మీరు నన్ను ఓడిపోనివ్వ లేదు, అలాగే మీరు నన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వరని నాకు తెలుసని ఆమె పేర్కొంది.

 

View this post on Instagram

 

Shared post on Time

.