గతంలో బిగ్ బాస్ షో లో పాల్గొన్న అసురెడ్డి అంతకు ముందు ఎలాంటి గుర్తింపు లేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలో పాల్గొందో అప్పటి నుండి అమ్మడి క్రేజ్ సూపర్ రేంజ్ లో దూసుకొని పొయింది. ఇక తాను రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ ఫోటోల తో మరింత ఫేమస్ అయ్యింది. ఇలా చాలా రోజులు ఇద్దరు క్లబ్బులు, పబ్బులు కు తెగ తిరిగారు.
ఇక కొన్ని రోజులగా తన స్కిన్ షో తో , హాట్ వీడియోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలా రోజు రోజుకు తన గ్లామర్ ను పెంచే ఫోటో షూట్స్ పెంచుకుంటూ పోతూనే ఉంది. రీసెంట్ గా తన రేంజ్ లో వున్న వారు ఎవరూ కూడా ఇంత రెగ్యులర్ గా స్కిన్ షో ఫోటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం లేదు. ఈ హడావుడి చూస్తూంటే ఆమె ఇదంతా చేసేది సినిమా అవకాశాల కోసమే అని తెలుస్తోంది.
ఇక ఈమె కూడా కొంత మంది సెలబ్రిటీల లాగా తనపై వచ్చే కామెంట్స్ ను శాంతంగా తీసుకోక నెటిజన్స్ మీద ఎదురు దాడి చేస్తోంది. ఒకప్పుడు ఒక హాట్ యాంకర్ కూడా ఇలాగే చేసి చివరకు తగ్గాల్సి వచ్చింది. కాని ఈమె మాత్రం తన పై కామెంట్స్ చేసే వారిపై ఒక రీల్ లో కామా తురాణాం న: భయం.. న: లజ్జ.. అనే డైలాగ్ ని పెట్టింది. దీనితో చాలా మంది ముందు నీ బట్టలు సరిగా ఉంటే మేమెందుకు కామెంట్స్ చేస్తాం అని, ముందు నువ్వు తగ్గించుకో అని అంతకు ముందు కంటే రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈమె పై నెగెటివ్ కామెంట్స్ ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు.