సీక్వెల్ కి సిద్ధమైన సమంత.. ఖాకీ దుస్తుల్లో అదరగొట్టేసిందిగా..!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం యశోద తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని.. కలెక్షన్ల పరంగా ఒక మోస్తారుగా వచ్చినప్పటికీ బిజినెస్ పరంగా నిర్మాతలను సేఫ్ జోన్ లో పడేసిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈ సినిమాతో నిర్మాతలకు సమంత విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సమంతతో చేస్తే సినిమా గిట్టుబాటు అవుతుందని వారు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది . ఈ క్రమంలోనే యశోద 2 తీసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.

Samantha Ruth Prabhu trained for 'Yashoda' with the same action director as 'The Family Man 2'

యశోద 2 మాత్రమే కాదు యశోద 3 తీయడానికి కూడా కాన్సెప్ట్ తమ దగ్గర రెడీగా ఉందని, కేవలం సమంత అంగీకరిస్తే ఈ రెండు భాగాలు కూడా కంప్లీట్ చేస్తామని దర్శకుడు హరి హరీష్ వెల్లడించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. యశోద సీక్వెల్లో సమంత పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. యశోద సినిమాలో పోలీస్ ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్న ఆమె కొన్ని అనివార్య కారణాలవల్ల జాబులో జాయిన్ కాలేకపోయినట్లుగా చూపించారు. కానీ ఈ సీక్వెల్ లో మాత్రం ఫుల్ ఖాకీ దుస్తుల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం.

పోలీస్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సమంతకు ఎదురయ్యే సవాళ్ళతోనే సీక్వెల్ కథ ఉంటుందని ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు యశోద సినిమాలో సమంతను ఇష్టపడిన ఉన్ని ముకుందన్ సీక్వెల్లో వరలక్ష్మి శరత్ కుమార్ తో చేతులు కలిపి ఆమెపై ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అనేది ఈ సినిమాలో చూపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సమంత ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఈమె ఆరోగ్యం కుదుటపడితే తప్ప సీక్వెల్ మొదలు పెట్టలేమని కూడా దర్శకనిర్మాతలు తెలిపారు. మరోపక్క సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news