మరో లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన సమంత.. ఎన్ని కోట్లు అంటే..?

-

ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు పెద్దపెద్ద ప్రాపర్టీలను కొనుగోలు చేస్తూ తమ ఆస్తులను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న మహేష్ బాబు సరికొత్త వ్యాపారాలను మొదలుపెట్టగా ఇక నిన్న ఎన్టీఆర్ కూడా బెంగళూరులో సరికొత్త బిజినెస్ మొదలు పెట్టారు. అంతేకాదు నాగార్జున, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా చాలామంది ప్రత్యేకంగా తమకంటూ ప్రత్యేకమైన వ్యాపారాలను మొదలుపెట్టి సరికొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా పోటీపడి మరీ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం దేశంలోని మహానగరాలలో లగ్జరీ విల్లాస్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా వెళ్తోంది.. ఇప్పటికే ఒక లగ్జరీ హౌస్ ను కొనుగోలు చేసిన ఈమె హైదరాబాదులో మరో లగ్జరీ ఇల్లు ఉండాలని ఎప్పటినుంచో కలలు కందట. అందుకే ఆ కోరికను తాజాగా తీర్చుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హైదరాబాద్ నగరంలోని జయభేరి ఆరెంజ్ కౌంటీ లో ఆమె ఒక ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇక ఈ అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో సమంత ఒక లగ్జరీ హౌస్ను కొనుగోలు చేసిందట. ఇది 3 బిహెచ్కె ఫ్లాట్ అని గత కొద్ది రోజులుగా ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ పనులను కూడా దగ్గరుండి మరీ సమంత క్లియర్ చేయించిందని సమాచారం. అయితే ఈ ఇంటి కోసం ఏకంగా 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందట సమంత. లగ్జరీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సకల సౌకర్యాలతో ఈ ఇల్లు తీర్చిదిద్దుతుందని తెలుస్తోంది. ఇక ఈ ఇల్లు చూసిన చాలా మంది ఆ ఇల్లు చాలా లావిష్ గా ఉంది అని చెబుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news