శ్రీ లక్ష్మీ వృషద్దరి ప్రొడక్షన్స్, గీత ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ లో రాధికా కుమార స్వామి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ” సంహారిణి ” 1980. లో ఒక రాజు కుటుంబంలో జరిగే కథ 2019 లో కూడా కొనసాగుతుంది. హారర్, కామెడీ. థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహించారు. రాజు కుమార్తె దమయంతి పాత్రలో రాధికా కుమారస్వామి నటించారు, అలాగే రాజు పాత్రలో తమిళ సీనియర్ నటుడు నటించాడు.
ఈ పాత్ర పేరు రాజ బహుదూర్ విజయేంద్ర వర్మ. ఈ చిత్రాన్ని బెంగళూర్, మైసూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ చిత్రం కోసం మూడు అద్భుతమైన భారీ సెట్స్ వేసారు. విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ తో ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీలో సందర్భానుసారం మూడు పాటలు ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. చిత్రం విడుదల ముందు ఆడియో విడుదల చెయ్యనున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.