ఈసారి వ‌ర్మ‌కి ప‌వ‌న్ టార్గెటా…?

-

సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ తాజా చిత్రం క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు. ఈ చిత్రం టైటిలే పెద్ద వివాదంతో కూడుకున్న‌ది ఇక సినిమా విష‌యీనికి వ‌స్తే ఎలా ఉండ‌బోతుందో ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది.
ఈ సినిమా చాలా సంచలనాలకు కేంద్రబిందువుగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా ఈ చిత్ర ప్రమోషన్ కోసం పెద్దోళ్లనే వాడేస్తున్నాడు ఈయన. ఇప్పుడు వర్మ విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై ఆసక్తితో పాటు పవన్ కల్యాణ్ అభిమానుల్లో అసహనాన్ని కూడా పెంచేస్తున్నాయి. ముఖ్యంగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ పవన్ కల్యాణ్ డూప్ ఫోటో ఒకటి విడుదల చేసాడు వర్మ.

అమ్మాయిల మధ్యలో పవన్ మైక్ పట్టుకుని అరుస్తున్నట్లు ఉన్న ఈ ఫోటోను చూసి వర్మను తిట్టేవాళ్లు తిట్టేసారు.. పొగిడేవాళ్లు పొగిడేసారు. ఇక ఇప్పుడు మరో ఫోటో విడుదల చేసాడు ఈయన. ఈ ఫోటోలో నారా లోకేష్ డూప్‌ను కూడా దించేసాడు వర్మ. పవన్ లోకేష్ మాట్లాడుతున్నట్లు ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పైగా దీనికింద వర్మ పెట్టిన పోస్ట్ మరింత కామెడీగా అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news