“సమ్మతమే” మూవీ ట్రైలర్ రిలీజ్

-

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సమ్మతమే’. యూ.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషన్స్ ప్రధానంగా సాగే చిత్రమిది. చాందినీ చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈనెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో సీనియర్ నటి సితార కనిపిస్తున్నారు. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, సరదాలు, బుజ్జగింపులు, వినోదాలు, విషాదాలు ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘లైఫ్ లో నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు ‘.. అంటూ హీరోపై.. హీరోయిన్ కోపాన్ని వ్యక్తం చేసే సీన్ సినిమా పై ఆసక్తిని పెంచేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news