చాందినికి అన్ని సార్లు సారీ చెప్పిన కిరణ్ అబ్బవరం..రొమాంటిక్‌గా ‘సమ్మతమే’ ట్రైలర్

-

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందినీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. గోపీనాథ్ రెడ్డి ఈ పిక్చర్ కు దర్శకత్వం వహించడంతో పాటు స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

రొమాంటిక్ లవ్ స్టోరిగా వస్తున్న ఈ సినిమాలో పెళ్లి చేసుకోవాలని తహ తహలాడే యువకుడి పాత్రలో కిరణ్ అబ్బవరం కనిపించనున్నారు. ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం..చాలా చక్కటి డైలాగ్స్ వెరీ ఫన్నీ వేలో చెప్పాడు. తన ప్రేమను నెగ్గించుకోవడం కోసం ఎటువంటి తిప్పలు పడ్డాడనేది సినిమాలోనే చూడాలని మేకర్స్ చెప్పకనే చెప్పేశారు.

ఇక ట్రైలర్ లో చాందినికి కిరణ్ అబ్బవరం ఐదు సార్లు సారీ చెప్పడం చాలా సిల్లీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ ట్రైలర్ చూసి ఈ సారి డెఫినెట్ గా కిరణ్ అబ్బవరం హిట్ కొడతాడని సినీ అభిమానులు అంటున్నారు. ఈ నెల 24న పిక్చర్ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news