మరో సౌత్ రీమేక్..హిందీ ‘హిట్’ టీజర్ రిలీజ్ టైమ్ లాక్‌డ్

-

ఇటీవల కాలంలో దక్షిణాది భాషల్లో విజయవంతమైన చిత్రాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. అలా రీమేక్ అయిన ఫిల్మ్ ‘హిట్’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు శైలేశ్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం హిందీలో రీమేక్ అయింది. ఈ సినిమాకూ శైలేశ్ యే దర్శకత్వం వహించడం విశేషం.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చే నెల 15న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నెల 17న టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు కు జోడీగా ఈ చిత్రంలో సన్యా మల్హోత్ర నటించింది.

ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, టీ సిరీస్ ప్రజెంట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా హిందీలోనూ తప్పకుండా విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపున తెలుగులో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నది. ఇందులో హీరోగా అడివి శేష్ నటించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news