మన స్టార్ హీరోయిన్లు రోజురోజుకు అందంగా కనిపించడమే కాదు సినిమాలలో మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే వారు అలా అంత అందంగా కనిపించడానికి కారణం మేకప్, వారి కట్టు బొట్టు అని చెప్పాలి. అయితే వారిని అంత అందంగా తీర్చిదిద్దిన ఒక లేడీ గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఒక మహిళ మాత్రం లేడీ సెలబ్రిటీలకు చీర కట్టడం ద్వారా కళ్ళు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు.
ముఖ్యంగా మన దేశ సంప్రదాయంలో చీరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ అమ్మాయి అయినా సరే చీర కట్టింది అంటే ఇక ఆమె అందం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ , బాలీవుడ్ కి చెందిన లేడీ సెలబ్రిటీలు కూడా పలు ఈవెంట్లలో చీరల్లో మెరుస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే ..అయితే చాలామంది సెలబ్రిటీల చీరకట్టు వెనుక డాలీ జైన్ ఉన్నారని చాలామందికి తెలియదు. కేవలం 18 సెకండ్లలో చీర కట్టే టాలెంట్ ఆమె సొంతం. ఏకంగా 325 రకాల డ్రెస్సింగ్ స్టైల్స్ ఆమెకు తెలుసు.
అంతేకాదు ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి ఊహించని స్థాయిలో అవగాహన కలిగి ఉండడం వల్లే ఆమెకు ఊహించని స్థాయిలో పాపులారిటీ కూడా లభిస్తుంది. ఇకపోతే చీర కట్టడానికి డాలీ జైన్ రూ.35 వేల నుంచి రూ.2 లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం.. డాలీ జైన్.. ఆమె అత్తయ్య చీర మాత్రమే కట్టుకోవాలని చెప్పడంతో తనకు తాను చీర కట్టుకోవడం మొదలుపెట్టిన ఈమె చీర కట్టులో ప్రావీణ్యం సంపాదించి ఈ స్థాయికి ఎదిగారు. ఇప్పటికే నయనతార, అలియా భట్ , సోనం కపూర్ , దీపికా పదుకొనే వంటి పలువురు సెలబ్రిటీల కోసం ఆమె పని చేస్తున్నారు.