రణ్​బీర్ ‘యానిమల్’ టీజర్ రిలీజ్.. సందీప్ వంగాకు మరో బ్లాక్​బస్టర్ కన్ఫమ్

-

అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాలతో సూపర్ స్టార్​డమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలతో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రణ్​బీర్ ప్రధాన పాత్రలో.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రీ టీజర్​ను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు.

50 సెకన్లు ఉన్న ఈ ప్రచార చిత్రంలో రణ్​బీర్​లో ఫస్ట్​లుక్​లో ఉన్నట్టుగా గొడ్డలిని పట్టుకుని విలన్ల గుంపును నరుక్కుంటూ వెళ్లారు. బ్యాక్​గ్రౌండ్​లో ఓ సాంగ్​ వచ్చింది. క్రైమ్​ అండ్​ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న థియేటర్లలో పాన్​ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ‘యానిమల్’​పై ఆడియెన్స్​ అంచనాలను ఎక్కువే పెట్టుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news