కాలేజ్ అమ్మాయిల కోసం గొప్ప మనసు చాటుకున్న సంయుక్త..!

-

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని దక్కించుకున్న సంయుక్త మీనన్ తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 70 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రూ.100 కోట్ల వైపు వేగంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా తాజాగా సంయుక్త మీనన్ తన గొప్ప మనసును చాటుకుంది. ఇకపోతే ఇటీవల ఒక టీవీ రియాల్టీ షో కి వెళ్లిన సంయుక్త తాను గెలుచుకున్న స్కూటీని ఒక కాలేజీ అమ్మాయికి బహుమతిగా ఇచ్చి ఆమెను సర్ప్రైజ్ చేసింది. అంతే కాదు ఇంకో అమ్మాయికి తానే స్కూటీ కొనిస్తానంటూ ముందుకు వచ్చింది.

ఇకపోతే బస్సులో ట్రావెల్ చేస్తూ కాలేజీకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలు సంయుక్త సహాయంతో పట్టరాని ఆనందంతో మునిగిపోతున్నారు ..అంతే కాదు ఈ విషయం తెలిసిన చాలామంది సంయుక్త మంచి మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. విరూపాక్ష సినిమాను ప్రేక్షకులలోకి మరింతగా తీసుకెళ్లడానికి ఒక రియాల్టీ షోలో చిత్ర బృందం సందడి చేసింది. సంయుక్త తో పాటు హీరో సాయిధరమ్ తేజ్ , సోనియా సింగ్ ,రవి కృష్ణ ఈ షోలో సందడి చేశారు.

అయితే ప్రోగ్రాంలో గెలుచుకున్న స్కూటీని అక్కడికి వచ్చిన కాలేజీ అమ్మాయిల్లో ఎవరో ఒకరికి బహుమతిగా ఇస్తానని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. కానీ అక్కడ సంయుక్త గెలిచింది. దాంతో సాయి ధరంతేజ్ చెప్పినట్టుగానే సంయుక్త కూడా తనకు వచ్చిన స్కూటీని ఒక కాలేజీ అమ్మాయికి బహుమతిగా అందించింది. ఈ క్రమంలోనే సింగిల్ పేరెంట్ ఉన్న ఇద్దరు అమ్మాయిలను ఎంచుకున్న ఈమె అందరిలో ఒకరికి తాను గెలుచుకున్న స్కూటీని గిఫ్టుగా ఇచ్చి అలాగే మరొక అమ్మాయికి తానే కొత్త స్కూటీ కొనిస్తానని మాట ఇచ్చింది. ఇది చూసిన చాలామంది బ్యూటీ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news