తమిళ నాట భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సరిలేరు నీకెవ్వరు, తమిళంలో అనువాదమైంది. మహేష్ బాబుకి తమిళంలో మంచి ఫాలోయింగే ఉంది. అందువల్ల తమిళనాడులో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

170కంటే ఎక్కువ థియేటర్లలో సరిలేరు నీకెవ్వరు తమిళ అనువాదం ప్రదర్శితం కానుంది. కరోనా కారణంగా కొత్త సినిమాలేమీ లేకపోవడం వల్ల భారీ ఎత్తున సరిలేరు నీకెవ్వరు తమిళ అనువాదానికి థియేటర్లని కేటాయిస్తున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ చిత్రానికి తమిళంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.