ట్రెండ్ ఇన్: సినిమా అప్‌డేట్ ఇవ్వాల్సిందే..మహేశ్ అభిమానుల డిమాండ్..స్పందించిన మేకర్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ అభిమానులు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కాగా, ఫిల్మ్ ట్రైలర్ ఎప్పుడిస్తారు? అనే విషయమై అభిమానులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వారు ‘సర్కారు వారి పాట’ పిక్చర్ ప్రొడ్యూసర్స్ ను ట్రోల్ చేశారు. వరస్ట్ టీమ్ అంటూ ట్వీట్స్ చేశారు.

బుధవారం #SarkaruVaariPaata సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేస్తూ అప్ డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్ డేట్ ఇవ్వకపోతే థియేటర్లు తగులబెడతామని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయమై స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది.

వచ్చే నెల మొదటి వారంలో టీజర్ ఉంటుందా మావా? అని ఓ అభిమాని క్వశ్చన్ చేయగా ‘యెస్’ అని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ ట్వి్ట్టర్ హ్యాండిల్ నుంచి రిప్లయి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్వి్ట్టర్ వేదికగా షేర్ చేశాడు సదరు అభిమాని.

రుత్ లెస్ మహేశ్ ఫ్యాన్స్ అనే పేరుతో ఇలా కొందరు మహేశ్ అభిమానులు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ ను వరుసగా ట్వీట్ చేయగా, అది ట్రెండింగ్ లోకి వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాజాగా మాస్ సాంగ్ పిక్చరైజేషన్ పూర్తి అయినట్లు తెలిపారు మేకర్స్. ఇందులో మహేశ్ సరసన హీరోయిన్ గా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటిస్తోంది.