SDT 15: సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ నుండి బిగ్ అప్డేట్ !

-

రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న హీరో సాయిధరమ్ తేజ్.. మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టారు. రిపబ్లిక్ సినిమా విడుదలైన తర్వాత పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్.. మళ్లీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షురూ చేశారు. ఎస్‌డీటీ-15 వర్కింగ్ టైటిల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. కేవలం 25 రోజుల్లోనే 30 శాతం షూటింగ్ పూర్తయినట్లు సినీ బృందం పేర్కొంది.

కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ థ్రిల్లర్ సినిమా చేస్తుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ని మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ మిస్టికలు థ్రిల్లర్ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ నెలలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news