Selfish: ఈ యంగ్ హీరో బాగా ‘సెల్ఫిష్’..రెండో సినిమాకే ఫోజులు!

-

తెలుగు చిత్ర సీమ అగ్ర నిర్మాత దిల్ రాజు సినీ పరిశ్రమలో సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కుటుంబం నుంచి హీరోగా వచ్చాడు ఆశిష్ రెడ్డి. తొలి సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సెలక్ట్ చేసుకుని సక్సెస్ అయ్యాడు. ‘రౌడీ బాయ్స్’ ఫిల్మ్ తో సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో..అప్పుడే ‘సెల్ఫిష్’ అయిపోయాడు. అవునండీ..తను నటిస్తున్న రెండో చిత్రం పేరు ‘సెల్ఫిష్’.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సదరు పోస్టర్ లో ఆశిష్ రెడ్డి వెరీ డిఫరెంట్ లుక్ లో కనబడుతున్నారు. స్లీవ్ లెస్ జాకెట్ తో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కర్లీ హెయిర్ గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. బైక్ రైడ్ చేస్తున్న ఫొటో ఒక దానిని షేర్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం జరుగనున్నట్లు తెలిపారు. కాశీ విశాల్ ఈ పిక్చర్ కు డైరెక్టర్ కాగా, ఈ సారి కూడా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌నే సెలక్ట్ చేసుకున్నాడు ఆశిష్.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌ కూడా ఇందులో భాగమైంది. ఈ సినిమా ఓపెనింగ్ కోసం ఆశిష్ రెడ్డి తన చిచ్చ ‘దిల్’ రాజును, ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్, ‘ఎఫ్ 3’ డైరెక్టర్ అనిల్ రావిపూడిలను ఆహ్వానించారు. వారికి ఆహ్వానం పలికిన క్రమంలోనూ ‘సెల్ఫిష్’గా బిహేవ్ చేశాడు ఆశిష్ రెడ్డి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. తొలి చిత్రంలో క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తో నటించిన ఆశిష్ రెడ్డి..ఈ సారి యంగ్ అండ్ న్యూ హీరోయిన్ తో నటిస్తారని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news