ఆ హీరోతో సినిమా చేయాలనుకున్న సీనియర్ హీరోయిన్ రాశి.. కానీ..!!

-

సీనియర్ హీరోయిన్ రాశి..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపైన కూడా నటిస్తున్న రాశి..తను అనుకున్న హీరోతో మాత్రం సినిమా చేయలేకపోయింది. ఆ హీరో ఎవరు? ఎందుకు ఆమెకు చాన్స్ రాలేదు ? అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రాజశేఖర్, బాలకృష్ణ లతో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశి..తన ఫేవరెట్ హీరోతో మాత్రం సినిమా చేయలేకపోయింది. ఆ హీరో ఎవరో కాదండోయ్.. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్.. ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించాలని రాశి అనుకుందట. కానీ, సినిమా చేయలేకపోయింది.

వెంకటేశ్ సరసన కథానాయికగా రాశి నటించాలనుకుంది. అది జరగలేదు. కానీ, ఆయనతో స్పెషల్ సాంగ్ చేసింది రాశి. ‘శ్రీను’ చిత్రంలో ‘ఒమనాలి’ అనే స్పెషల్ సాంగ్ ను చేసింది రాశి. అలా తన కోరికలో సగం అయిన నెరవేర్చుకుంది రాశి. రాశి త్వరలో ఓ బిగ్ ప్రాజెక్ట్ ద్వారా వెండితెరపైన మెరవబోతున్నదని తెలుస్తోంది.

రాశికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’ పాత్ర ఆఫర్ వచ్చింది. కానీ, ఆ పాత్ర స్వభావం ప్రకారం.. చీర కట్టు, బొడ్డు చూపెట్టడంతో పాటు తొడల వరకు చీర కట్టుకోవాలని చెప్పగా, అది నచ్చక ఆ పాత్రను రాశి రిజెక్ట్ చేసిందట. అలా ఆ పాత్ర అనసూయ భరద్వాజ్ వద్దకు వెళ్లింది. ఆ పాత్ర ద్వారా అనసూయ బాగా పాపులర్ అయిపోయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news